ప్రతి ఒక అంగన్వాడీ టీచర్ పోషణ్ ట్రాకర్ ఎన్ హెచ్ టి ఎస్ యాపులపై కచ్చితంగా అవకాశాన కలిగి ఉండాలి.

జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి.

Jun 21, 2024 - 19:27
 0  7
ప్రతి ఒక అంగన్వాడీ టీచర్ పోషణ్ ట్రాకర్ ఎన్ హెచ్ టి ఎస్ యాపులపై కచ్చితంగా అవకాశాన కలిగి ఉండాలి.
ప్రతి ఒక అంగన్వాడీ టీచర్ పోషణ్ ట్రాకర్ ఎన్ హెచ్ టి ఎస్ యాపులపై కచ్చితంగా అవకాశాన కలిగి ఉండాలి.

జోగులాంబ గద్వాల 21 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల.  ప్రతి ఒక్క అంగన్వాడి టీచర్ పోషన్ ట్రాకర్ ఎన్ హెచ్ టి ఎస్ యప్ లపై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆస్పిరేషనల్ బ్లాక్ గట్టు మండలం అంగన్వాడి టీచర్లకు పోషన్ ట్రాకర్, ఎన్ హెచ్ టి ఎస్  యాప్ లలో  అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతో  అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అంగన్వాడి టీచర్లు అందరూ పోషన్ ట్రాకర్, ఎన్ హెచ్ టి ఎస్ యాప్ లపై అవగాహన కలిగి ఉందాలని, రోజువారి  కార్యక్రమాలను యాప్ లో నమోదు చేయాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. ఇండికేటర్స్ ఖచ్చితంగా పురోగతిని పెంచే విధంగా కృషి చేయాలని, ఇండికేటర్లపై చాట్ల ద్వారా సెంటర్ యొక్క ప్రగతిని బట్టి టీచర్స్ కి గ్రూప్ డిస్కషన్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం రోజు వారి నివేదికలను తప్పనిసరిగా యాప్ లలో నమోదు చేయాలని సిడిపిఓ కమలాదేవి  అన్నారు. 
     

 ఈ కార్యక్రమంలో  సిడిపిఓ కమలాదేవి, డి డబ్ల్యూ ఓ ట్రైనింగ్ శిక్షకులు రఘు, కళ్యాణ్ మరియు సూపర్వైజర్లతో పాటు ఏబిపి కోఆర్డినేటర్ ఆఫ్సర్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333