హోమ్ కేర్ పేషెంట్లకు నాణ్యమైన చికిత్స ఇవ్వాలి:- డి ఎం హెచ్ ఓ  డాక్టర్ జె సంధ్య  కిరణ్మయి

Nov 14, 2025 - 19:50
 0  0
హోమ్ కేర్ పేషెంట్లకు నాణ్యమైన చికిత్స ఇవ్వాలి:- డి ఎం హెచ్ ఓ  డాక్టర్ జె సంధ్య  కిరణ్మయి

••• జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో సమీక్షా సమావేశం.

••• జిల్లా ఆస్పత్రిలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందికి సూచనలు.

••• జోగులాంబ గద్వాల 14 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లా ఆస్పత్రిలో వివిధ విభాగాల యందు పనిచేస్తున్న...ఎల్డర్ లీకేర్, పాలేటివ్ కేర్, ఎన్సిడి క్లినిక్, సర్వైకల్ స్క్రీనింగ్, జిల్లా మెంటల్ హెల్త్ క్లినిక్, నందు పనిచేస్తున్న సిబ్బందికి ఈరోజు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి అందుతున్న సేవలు గురించి స్టాప్ ని అడిగి తెలుసుకున్నారు... ముఖ్యంగా పాలియెటివ్ కేర్ నందు పేషెంట్లకు ఇస్తున్న సేవలు గురించి అడిగి తెలుసుకుని హోమ్ కేర్ వాహనాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని... వెళ్లినప్పుడు పేషెంట్ వివరాలు అందుతున్న సేవలు సూచనలు సలహాలు తెలియజేసి అవసరమైన వారిని జిల్లాకు తీసుకొచ్చి అడ్మిషన్ చేయాలని తెలిపారు... ఇట్టి కార్యక్రమంలో హైరిస్కు, మీడియం, లో... కేసులను పర్యవేక్షించాలని... ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంచుకొని సరైన సమయంలో వెళ్లి చికిత్స అందివ్వాలని తెలిపారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మీటింగ్లకు వెళ్లి దేశంలో వివరాలు తెలియజేయాలని..అదేవిధంగా వివిధ విభాగాలు పనిచేస్తున్న తీరు అడిగి తెలుసుకున్నారు.. సర్వైకల్ స్క్రీనింగ్, మెమోగ్రఫీ.. మహిళ  కేసులను  అర్బన్ సెంటర్ల నుండి  వివిధ గ్రామాల నుండి నుండి మోటివేషన్ చేసి జిల్లా ఆస్పత్రికి పంపాలని సూచించారు...

ఇట్టి సమీక్ష సమావేశానికి జిల్లా కోఆర్డినేటర్ శ్యాంసుందర్  మరియు వివిధ విభాగాల స్టాఫ్ నర్సులు సిబ్బంది పాల్గొన్నారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333