ధరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టళ్లలో సీటు ఇవ్వాలి. 

Jul 22, 2024 - 20:08
 0  55
ధరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టళ్లలో సీటు ఇవ్వాలి. 

*ప్రభుత్వ హాస్టళ్లలో  మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్షా 

హాజరైన వివిధ హాస్టళ్ల వార్డెన్లు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు
   
   ఈ రోజు గద్వాల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సమావేశం మందిరం లో జిల్లా కలెక్టర్ బి.యం  సంతోష్ గారు ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో  ప్రభుత్వ హాస్టళ్లలో  మౌలిక వసతుల కల్పనపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ శాఖల అధికారులు, హాస్టల్స్ వార్డెన్లు, వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

  ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.... 

గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో చదువుకోడానికి విద్యార్థులు ఎక్కువగా మొక్కు చూపడంతో గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు పాఠశాల కళాశాల చదువుకోడానికి విద్యార్థిని విద్యార్థులకు విద్యతోపాటు వారికి హాస్టల్ సౌకర్యాలు కూడా కల్పించాలని ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని హాస్టల్స్ లో వారి వసతి కన్నా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు రావడంతో కొంత ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం నుండి వసతులను పెంచే విధంగా కృషి చేయాలని కోరారు. 

  ఎస్సీ.ఎస్టీ,బీసి బాలికల మరియు బాలుర హాస్టల్ లో మౌలిక వసతులు కల్పించాలి అని అలాగే దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్ధికి సంక్షేమ హాస్టల్ లో అవకాశం కల్పించాలి కోరారు.

       వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు కూడా జిల్లాలో హాస్టల్స్ లో ఉన్న ఇబ్బందులను విద్యార్థినీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లండి త్వరగా పరిశీలించి విద్యార్థులకు మంచి హాస్టల్స్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. 

  జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ ....


ఈ సంవత్సరం విద్యార్థులు విద్యా రంగంలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో హాస్టల్లో విద్యార్థులకు సరైన సీటు లేక వసతి లేక ఇబ్బంది పడుతున్న ఈ విషయాన్ని తొందరగా పరిష్కరించి గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ హాస్టల్లో వసతులు మౌలిక సదుపాయాలు భవన సౌకర్యం ఎక్కడ ఇబ్బందుల్లో వాటిని ఆగస్టు లోపు పూర్తి ఎస్టిమేట్ పూర్తిచేసి త్వరగా హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించి హాస్టల్లో నాణ్యతమైన సౌకర్యాలు, భోజనము కల్పించే విధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో అన్ని రకాల సౌకర్యాలతో హాస్టలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

   ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కురుమన్న, ప్రవీణ్, జిల్లా అధికారులు, హాస్టల్ వార్డెన్, విద్యార్థి సంఘల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333