పలువురు ఇండ్ల నుండి 1HP మోటార్ల ను స్వాధీనం చేసుకున్న వాటర్ వర్క్స్ సిబ్బంది

గురువారం నాడు సూర్యాపేట మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ సిబ్బంది పట్టణంలోని పలు ప్రాంతాలలో మోటార్ల ద్వారా మున్సిపల్ వాటర్ చోరీ చేస్తున్న పలువురి నివాస గృహాల నుండి 1 HP మోటార్లు స్వాధీనం చేసుకున్నారు... ఆకస్మికంగా పలువురి నివాసాలలో పరిశీలన చేయగా భారీ ఎత్తున మోటర్ల ద్వారా నీటిని తోడుతున్నారని వాటర్ వర్క్స్ సిబ్బంది తెలిపారు... పది ఇండ్లకు సరిపోయే నీటిని ఒక్కరే మోటార్ల ద్వారా తోడుతున్నారని, అందుకనే చాలామందికి మున్సిపల్ వాటర్ తక్కువ ధారతో వస్తుందని వారు తెలిపారు... రేపు కూడ పలు ప్రాంతాలలో మోటర్లను తొలగించే కార్యక్రమం నిర్వహిస్తామని వారు అన్నారు...