అక్రమ ఇసుక తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
ట్రాక్టర్ ను పట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకన్న

అడ్డగూడూరు 17 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చిర్రగూడూర్ గ్రామంలో బిక్కెరు వాగు నుండి పర్రేపాటి మహేష్ అనే వ్యక్తి అక్రమ ఇసుకను ఎలాంటి ఎమ్మార్వో నుండి అనుమతులు లేకుండా ఎక్కువ ధరకు అమ్ముకోవాలని బొడ్డుగూడెం వెళుతున్న ఇసుక ట్రాక్టర్ ను నమ్మదగిన వ్యక్తి సమాచారం మేరకు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆదేశాల మేరకు హుటా హుటిన అక్కడికి సిబ్బందితో హెడ్ కానిస్టేబుల్ వెంకన్న చేరుకొని పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.