కన్నులపండువగా జయ స్కూల్ కిడ్స్ కన్వకేషన్ ప్రోగ్రామ్
సూర్యాపేట జిల్లా కేంద్రం లోని శ్రీ శ్రీ నగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు జయ కిండర్ గార్టెన్ కన్వకేషన్ ప్రోగ్రామ్ 2025 ను కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు వచ్చే విద్యాసంవత్సరంలో జయ స్కూల్ యాజమాన్యం పర్యవేక్షణలో పాఠశాల నిర్వహణ జరుగుతుందని, అత్యుత్తమైన జయ స్కూల్ సిలబస్ నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు అందిస్తామని అన్నారు. చిన్నారి విద్యార్దులకు ఆటపాటలతో ఆధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్ధాయి విద్యను అందజేస్తామని తెలిపారు. జయ యాజమాన్యంలో నడిచే ఈ విద్యాసంస్థలో తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జయ స్కూల్ డైరెక్టర్ లు జెల్లా పద్మ, బింగి జ్యోతి ల చేతులమీదుగా విద్యార్దులకు కిండర్ గార్టెన్ కన్వకేషన్ సర్టిఫికేట్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.