పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి ఆర్థిక సహాయం ఆరాధ్య ఫౌండేషన్
పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి అండగా నిలిచిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడొజ్ వాణి శ్రీకాంత్ రాజ్........... పదివేల రూపాయల ఆర్థిక సాయం చేసి భవిష్యత్తులో విద్యా వైద్యం ఖర్చులు భరిస్తానన్నా ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజ్ ......... సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరం గ్రామానికి చెందిన తల్లిదండ్రులు లేని పగిళ్ల మహేశ్వరి కీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయి తమ్ముడు నానమ్మతో సహా అనాధగా మిగిలింది బుధవారం నాడు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో అనారోగ్య సమస్యతో మృతి చెందింది వివిధ దినపత్రికలో ప్రచురించిన కథనానికి స్పందించి ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ పగిళ్ళ మహేశ్వరి ఐదో రోజు సందర్భంగా మహేశ్వరి చిత్రపటానికి నివాళులర్పించి ఆ కుటుంబాన్ని ఆదివారం నాడు పరామర్శించి మనోధైర్యం చెప్పి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసి మాట్లాడుతూ భవిష్యత్తులో ఆ బాబు పగిళ్ల సాయి భార్గవ్ రెండో భార్య చనిపోవడంతో ఆమె కొడుకు కొడుకు నందకిషోర్ చదువులకు అయ్యే ఖర్చును భరిస్తానని అలాగే ఆ కుటుంబానికి భరోసాగా ఉండి వైద్య ఖర్చులు కూడా బరిస్తానని ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు ఆరాధ్య ఫౌండేషన్ సేవలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యువత బీసీ సంఘాల సహకారంతో జిల్లావ్యాప్తంగా పేద కుటుంబాలను ఆదుకుంటానని భరోసా ఇచ్చా రు ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సహాయం ఫౌండేషన్ ఛైర్మెన్ పచ్చిపాల రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ తాను పుట్టిన తుంగతుర్తి నియోజకవర్గంలో పేద ప్రజల రుణం తీర్చుకోవడానికి తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజ్ పేద ప్రజల కష్టాలను తీర్చడం కొరకు ఆరాధ్య ఫౌండేషన్ ను స్థాపించి తుంగతుర్తి నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో పేద కుటుంబాలను ఆదుకొని వారి జీవితాలలో వెలుగులు నింపారని అలాగే పేద కుటుంబాలకూ విద్యా వైద్యం చేయించారని కొనియాడారు అందరూ తాడోస్ వాణి శ్రీకాంత్ రాజు లాగా గొప్ప మనసుతో ప్రతి గ్రామంలో పేద అనాధ కుటుంబాలకు అండగా ఉంటే పేద గుండెలు ఆగిపోవని అన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా వారు సుదీర్ఘ పోరాటం చేసి జైలు జీవితం గడిపారని అన్నారు ఆరాధ్య ఫౌండేషన్ బీసీ సంఘాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పేద అనాధ కుటుంబాలను ఆదుకొని వారి ప్రాణాలు కాపాడుతామని అలాగే సామాజిక సేవ కార్యక్రమాలలో. ముందుంటామని అన్నారు గొప్ప మనసుతో పేద అనాధ కుటుంబాన్ని ఆదుకున్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోస్ వాణి శ్రీకాంత్ రాజును బీసీ సంఘాల నాయకులు యువకులు అభినందించారు అనంతరం రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ఆ పేద అనాధ కుటుంబానికి ఇంతలా సహాయం అందుతుందంటే పత్రికా విలేకరుల అక్షర రూపమే కారణమని వారు పెద్ద మనసుతో కన్నీటి గాధలను రాస్తే దాతలు ముందుకొచ్చారని .... పత్రికా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు... మహేశ్వరి కుటుంబానికి పార్ధు హాస్పిటల్ ఎండి డాక్టర్ యారా పార్థసారథి 5000 రూపాయలు మన్నెం నిరంజన్ రెడ్డి గవర్నమెంట్ టీచర్ నడిగూడెం వారికి మరియు పెద్ద మనసుతో సాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెవిరాల సీతారామయ్య బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలంపల్లి సుధాకర్ గౌడ్ గ్రామ యువకులు మాజీ వార్డు మెంబర్ పగిళ్ల సైదులు శతకోటి వీరయ్య చెవిరాల మణికంఠ తంగేళ్ల వినోద్ నరేష్ తంగేళ్ల అంజయ్య పగిళ్ల శీను కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు