అడ్డగూడూరు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఘనంగా శతాబ్ది ఉత్సవాలు

Dec 26, 2024 - 15:43
Dec 26, 2024 - 18:06
 0  24
అడ్డగూడూరు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఘనంగా శతాబ్ది ఉత్సవాలు
అడ్డగూడూరు మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఘనంగా శతాబ్ది ఉత్సవాలు

అడ్డగూడూరు 26 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రములోని అంబేద్కర్  చౌరస్తాలో సిపిఐ పార్టీ అడ్డగూడూరు మండల కార్యదర్శి రేఖల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమం సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఉప్పుల శాంతి కుమార్ అధ్యక్షతన జరగగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చెడే చంద్రయ్య  పార్టీ జెండా ను ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెడే చంద్రయ్య మాట్లాడుతూ అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం(రష్యన్) కాంతిరేఖలు ప్రపంచ నలుదిశలకు ప్రసరించినట్లు బ్రిటిష్ వలన పాలనలో మగ్గుతున్న మన దేశంలోకి ప్రవేశించాయి బొంబాయి, మద్రాస్, కలకత్తా తదితర నగరాలలో అభ్యుదయ కామకులై యువకులు కొందరు బృందాలుగా ఏర్పడి రహస్యంగా పనిచేస్తూ కార్మికులను సంఘాలుగా ఆర్గనైజ్ చేయసాగారు. అరుదుగా లభించే మార్క్సిస్ట్ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల నిబద్ధతను పెంచుకున్నారు. కమ్యూనిస్టు ఒక వైపు జాతీయోద్యమంలో భాగంగా పనిచేస్తూ మరోవైపు రైతులు, కార్మికుల్ని సంఘటితం చేయసాగారు. విద్యార్థులుగా, విప్లకారులుగా విదేశాలకు వెళ్లి పలువురు అక్కడ కమ్యూనిస్టులుగా మారారు. అటువంటి వారిలో కొందరు 1920 లో సమావేశమై కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా 1925 డిసెంబర్ ఆఖరి వారంలో ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ లో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక మహాసభ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నీ కమ్యూనిస్టు గ్రూపులగా వారు అక్కడికి చేరుకున్నారు.1925 డిసెంబర్ 25 నుంచి 29 వరకు కాన్పూర్ లో పెండాల్లో ప్రత్యేక  తొలిసారి సమావేశమైనారు. 26వ తేదీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) ఏర్పార్టును అధికారికంగా ప్రకటించారు. మనదేశంలో కమ్యూనిస్టు పార్టీ శాస్త్రీయ సోషలిజం సిద్ధాంతాన్ని మన దేశంలోకి తెచ్చింది. ప్రాచుర్యం కలిగించింది. ఆ సిద్ధాంతం వెలుగులోనే కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, వ్యవసాయ కార్మిక, అభ్యుదయ రచయితలు, ప్రజానాట్యమండలి, మహిళా సంఘాలను ఏర్పాటు చేసిందని తెలియజేశారు. తెలంగాణ ప్రాంతంలో రజాకారులకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని అన్నారు.ఈ అడ్డగూడూరు మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 500 ఎకరాల పెద్ద రేగడి భూమిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీని ఆ పోరాటానికి బాలెంల నరసయ్య వడకాల చంద్రారెడ్డి నాయకత్వం వహించారన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల సహాయ కార్యదర్శి కందుకూరి వెంకన్న రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెడిపల్లి రవీందర్, వివిధ గ్రామ శాఖ కార్యదర్శి బొనుగా సుదర్శన్ రెడ్డి, సోలిపురం నాగిరెడ్డి, చెడే నాగేష్, బెల్లి శ్రీకాంత్, ఎడ్ల వెంకటయ్య, చుక్క అంజయ్య, మొగులయ్య, సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333