ఘనంగా శ్రీకనకదాసుల జయంతి
జోగులాంబ గద్వాల 18 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల ప్రముఖ కర్ణాటక వాగ్గేయకారుడు శ్రీ కనకదాసులవారి జయంతి సందర్భంగా సోమవారం మల్దకల్ మండల కేంద్రంలోని భక్తి మార్గంలో ఉన్న కనకదాసుల విగ్రహానికి స్వయంభు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కనకదాసుల స్ఫూర్తిని తీసుకుని ప్రతి ఒక్కరు నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు