పాలేరు కాలువ కు నీరు వెంటనే విడుదల చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఖమ్మం జిల్లా

Sep 22, 2024 - 17:39
Sep 22, 2024 - 23:15
 0  59
పాలేరు కాలువ కు నీరు వెంటనే విడుదల చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ  ఖమ్మం జిల్లా

పాలేరు కాల్వ నీరు వెంటనే విడుదల చేయాలి: ఆమ్ఆద్మీపార్టీ ఖమ్మం జిల్లా పరిశీలక బృందం డిమాండ్. కూసుమంచి: పాలేరు సాగర్ కాల్వకు నీరు విడుదల చేయడం ద్వారా ఖమ్మం జిల్లా లో ఎండిపోతున్న వరిపోలాలను సంరక్షించాలని ఆమ్ఆద్మీపార్టీ తెలంగాణా కోర్కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు డిమాండ్ చేశారు.ఆదివారం ఆమ్ఆద్మీపార్టీ పాలేరు రిజర్వాయర్ గండి పూడ్చివేత పనులు పరిశీలన అనంతరం కూసుమంచి లో విలేకరుల నుద్దేశించి ఆయన మాట్లాడారు.గత పక్షం రోజుల క్రితం కురిసిన అతివృష్టి వలన ఖమ్మం జిల్లా రైతులు మెట్ట పంటలు దెబ్బతింటే, ప్రస్తుతం పదిరోజులు గా సాగర్ కాల్వలకుపాలేరువద్ద పడ్డ గండివలన రైతులు వేలాది ఎకరాల్లో సేద్యం చేసిన వరి పంటలు, పొలాలు ఎండలు మూలంగా ఎండి బీటలు వారు తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు ఆదునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రకృతి విపత్తులను ఉండి ప్రజలను కాపాడడంలో వైఫల్యం చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకు పాలేరు రిజర్వాయర్ ఎడమ కాల్వకు గండిపడి గత ఇరవైరోజులుగా మరమ్మత్తులు చేసినప్పటకీ తిరిగి పడినకాడనే నీరు వదలగానే గండిపడడం నాసిరకం పని విధానం, పర్యవేక్షణ లోపం కు నిదర్శనంగా వారు ఆరోపించారు.శాశ్వితంగా పాలేరు కాల్వ మరమ్మత్తులు చేయాలంటే, కూలిన అండర్ టన్నెల్ నిర్మించాలంటే మూడు నెలల కాలం కనీసం పడుతుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారని,కానీ, తాత్కాలిక ప్రాతిపదికన పైపులు ద్వారా రెండు రోజులులో కాల్వకు నీరు అందిస్తామని పని ప్రదేశంలో సిబ్బంది చెబుతున్నప్పటికీ,అక్కడ పనులను పరిశీలిస్తే ,అలాకనిపించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్న ప్పటికీ,రైతులు ఎండిపోతున్న పొలాలకు భరోసా ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం నుండి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం పెద్ద స్థాయి ఇంజనీరింగ్ అధికారులు కూడా పని ప్రదేశంలో కనిపించలేదని ఆమ్ఆద్మీపార్టీ పరిశీలక బృందం ఆరోపించింది.ఆమ్ఆద్మీ పార్టీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణ సుబ్బారావు మాట్లాడుతూ పాలేరు కాల్వ నీరు సరఫరా లో వైఫల్యం కు బాద్యత వహిస్తూ మండలాల వారీగా సర్వే చేసి ఖమ్మం జిల్లా లో ఎండీపోయిన రైతుల వరి పొలాలకు ఎక్సగ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.ఒకవైపు పరిపూర్ణం గా రుణమాఫీ కాలేదు,రైతుభరోసా ఒక్క పైసా ఇవ్వలేదు, ఇటీవల తుపాను కు మెట్టపంటలు దెబ్బతిన్నాయి.సాగర్ కాల్వ గండి మూలంగా మాగాణి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పాలేర కాల్వ పై గండిని ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణలో యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి ఎండిపోతున్న పంట పొలాలు కు నీరందించాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ప్రకృతి విపత్తులు తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కంటే,ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే సమస్య తీవ్రతను తగ్గించవచ్చని ఆమ్ఆద్మీపార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు పసుమర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు.విలేకర్ల సమావేశం లో ఆమ్ఆద్మీపార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుత్తా నాగేశ్వరరావు, మీడియా ఇన్చార్జి సూర్య దేవర సంగమేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ఆమ్ఆద్మీపార్టీ తెలంగాణా కోర్ కమిటీ సభ్యులు నల్లమోతు తిరుమల రావు నేతృత్వంలో పాలేరు రిజర్వాయర్ పరిశీలించిన బృందం లో ఆమ్ఆద్మీపార్టీ తెలంగాణా రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వర్ణ సుబ్బారావు, ఆమ్ఆద్మీపార్టీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు పసుమర్తి శ్రీనివాస్, కార్యదర్శి గుత్తా నాగేశ్వరరావు, మీడియా ఇన్చార్జి సూర్య దేవర సంగమేశ్వర ప్రసాద్ తదితరులు ఉన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State