నైతిక అభివృద్ధియే దేశాభివృద్ధి అన్న మహాత్మా గాంధీ ఆరాటానికి ఆనవాళ్లే కనిపించడం లేదు.
స్వార్థ ప్రయోజనాలు, దోపిడీ, పీడన,ఆదిపత్యం, హత్యా రాజకీయాలు, ప్రజా ఉద్యమకారులపై అణచివేత, మానవీయ విలువలకు సమాధి.. స్వేచ్చా భారతిలో డెమోక్రసీకి ఇదేనా ఆదరణ?
****************************
---వడ్డేపల్లి మల్లేశం
"అద్దాల మేడలు రంగుల గోడలు మాత్రమే అభివృద్ధి కాదు నైతిక అభివృద్ధి ఏ దేశాభివృద్ధి" అని ఎలుగెత్తి చాటిన మహాత్మా గాంధీ పిలుపుకు నేటికీ ఆదరణ లభించకపోవడం విచారకరం. అంతేకాదు క్రమంగా నాటి నుండి నేటి వరకు మానవతా విలువలు క్షీనించి మసకబారిపోవడం, కొన్నిచోట్ల తెరమరుగు కావడం, ఆనవాళ్లే లేకుండా పోవడం రాబోయే వ్యవస్థ యొక్క పతనానికి దర్పణంగా భావించవలసిన అవసరం ఉంది. అంతేకాదు ఇది ఒక ప్రమాదకరమైన హెచ్చరికగా సమాజం గుర్తిస్తేనే, ప్రభుత్వాలు పసిగట్టి ఆలోచిస్తేనే భవిష్యత్తు కొంతవరకైనా ఆశాజనకంగా ఉంటుంది. హద్దు అదుపు లేకుండా హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, మానభంగాలు, పసి పిల్లల పైన లైంగిక దాడులను నిరంతరంగా మనం గమనించినప్పుడు ఏ విలువలకు ఈ పయనం అని మనకు మనం ప్రశ్నించుకోకపోతే ఎలా? పరిస్థితులు చేజారి పోతే, అశాంతి అల్లకల్లోలాలు అదుపు తప్పితే, గౌరవ మర్యాదలు ప్రేమానురాగాలు గతి తప్పితే ఇక భవిష్యత్తు అంధకారము కాక మరేమవుతుంది?కొన్ని సామాజిక విలువలు కట్టుబాట్లకు, నీతి నిజాయితీకి నిలయంగా ఉన్నటువంటి సమాజం గతానికి భిన్నంగా పూర్తిగా చేజారి పోవడాన్ని మనం గమనించకపోతే ఎలా? "ఆహారపు దుర లవాట్లు, అనారోగ్య వాతావరణం, నిర్లక్ష్యం కలిసి మనిషి జీవితాన్ని ఏరకంగా అంతం చేస్తుందో అలాగే సమాజంలో నైతిక విలువలు క్రమంగా క్షీణించి తెర మరగవుతూ ఉంటే కళ్ళారా చూస్తూ కూడా ప్రశ్నించకపోతే పట్టించుకోకపోతే మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది కనీసం అయినటువంటి అవగాహన. ఈ అవగాహనను ఆవలోకించక, ఆలోచించక, పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా ఎవరికి వారే తమ బాధ్యత ఏమీ లేనట్లు తమ వరకు మాత్రమే పరిమితమై స్వార్థపూరితంగా ఆలోచిస్తున్న కారణంగా ఎక్కడికక్కడ సమాజం నిట్ట నిలువునా చీలిపోతున్నది. నాసిరకం సిమెంటు కంకర ఇసుక ఇతర పదార్థాలతో నిర్మించిన నిర్మాణం పగుళ్లు బారినట్లు సామాజిక వ్యవస్థ నిర్మాణం గతి తప్పి తన ఉనికిని తానే కోల్పోతున్నది. "
ప్రజాస్వామిక విలువల పతనం బాధాకరం
*****************************************
"హక్కులకై కల బడుతూ బాధ్యతలకు నిలబడాలి అనేది ప్రాథమిక సూత్రం. సంస్థలు సంఘాలు ట్రేడ్ యూనియన్లు ప్రధానంగా నమ్మిన ఈ సిద్ధాంతాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు నిరంతరం ఆచరిస్తున్న సందర్భంలో ఇదేదో నేరమైనట్లు, కర్తవ్యం నిర్వహణ హక్కులకై పోరాటం దేశద్రోహమైనట్లు ఈ దేశ సంపద ప్రజలందరికీ చెందాలని ప్రశ్నించిన పాపానికి బలవంతపు మారణకాండ ఈ దేశంలో ఏదో రూపంలో కొనసాగుతూ ఉంటే సామాన్య ప్రజలు చేసిన కష్టాన్ని శ్రమను మరిచి కంటి నిండా కు నుకు తీయగలరా? " ప్రభుత్వాలు ప్రజాస్వామిక పద్ధతిలో జాతి సంపదను ప్రజలందరికీ సమానంగా పo చాలి అనే ఆలోచనతో అనేక సందర్భాలలో రాజకీయ నినాదాలతో తన ఉనికిని చాటుకుంటున్నది. కానీ పెట్టుబడిదారి వ్యవస్థ చేతిలోవున్న పాలకులు అవైపుగా కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇక ఉద్యమ సంస్థలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు హక్కుల కార్యకర్తలు మాత్రం ప్రభుత్వం సూచనప్రాయంగా ఆలోచన చేస్తున్నటువంటి రాజ్యాంగంలో రాసుకున్నటువంటి సమ సమాజాన్ని సా కారం చేసే క్రమము లోపల కొంత ప్రయత్నం చేయడం ఆ ప్రయత్నంలో భాగంగానే ఎందరో అమరులు కావడం అయినా ఆ లక్ష్యాన్ని జనం దృష్టిలో నిరంతరం సజీవంగా ఉంచే ప్రయత్నం చేయడం మనం నిత్యం చూస్తున్నదె. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, సమసమాజాన్ని సాధించాలని, సామ్యవాద స్థాపన తమ ఆశయమని, అసమానతలు అంతరాలు లేని వ్యవస్థను సా కారం చేసుకోవడానికి పోరాటం తప్పనిసరి అని తమ జీవితాలను పణ o గా పెట్టిన వాళ్ళు కూడా ఎందరో... ప్రభుత్వ ఆలోచన ప్రజాస్వామిక వాదుల ఆలోచన ఒకటే అయినప్పటికీ మార్గాలు వేరు కావడం, పాలకులు ఆలోచన వరకు మాత్రమే పరిమితమై ఆచరణలో పెట్టుబడిదారీ వర్గాన్ని పెంచి పోషించడం వలన ఉద్యమ సంస్థలు ప్రజాస్వామ్యవాదుల ఆలోచన ఆశయాలు కార్యరూపం కాల్చడం లేదు. కానీ పాలకులలో కొంతమంది బుద్ధి జీవులు ప్రజాస్వామిక స్పృహ కలిగినట్లు నటిస్తున్న వాళ్లు మాత్రం అప్పుడప్పుడు మేధావులను ఆహ్వానించి సలహాలు సూచనలు అడుగుతూనే ఉన్నారు. కానీ మళ్లీ తమకు నచ్చినట్లే చేస్తూ ఆలోచన చేసిన వాళ్ళ అంతు చూస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఈ దేశంలో అసమానతలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పేదరిక నిర్మూలనకు పేద ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడానికి పెట్టుబడిదారీ సంపన్న వర్గాల పైన కొంత అదనపు భారాన్ని పన్నుల రూపంలో వేయాలని సూచన చేసినందుకుగాను మేధావి వర్గాన్ని దేశద్రోహులుగా ముద్ర వేసిన వైనం పాలకుల యొక్క అంతర్గత ఆలోచన ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడానికి దోహదపడుతుంది. హక్కులు, బాధ్యతలు, రాజ్యాంగ సవరణలు, అవకాశాలు, రాజ్యాంగ ప్రవేశిక లోని మంచి మాటలు, సమర్థవంతమైన న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక శాసన వ్యవస్థలు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాయని గొప్పగా చెప్పుకుంటున్న మనం ఆచరణలో అనేక రకాలైన దోపిడీలు దహనకాండలు అణచివేత అత్యాచారాలను కలారా చూస్తున్న నేపథ్యంలో పైకి అందంగా కనిపించే మేడిపండు చందంగా భారత ప్రజాస్వామ్యం రోజు రోజుకు కొంత మంది చేతిలో బలహీనమవుతున్నది. ఆ రకంగా మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే సుమారు 7 దశాబ్దాలకు పూర్వమే నైతిక విలువల పైన ఆందోళన వ్యక్తం చేసిన మహాత్మా గాంధీ ప్రస్తుతం బ్రతికి ఉంటే ఈ అరాచక ఆకృత్యాలను కల్లారా చూస్తే నైతికత గురించి ఏమని వర్ణించేవారో ఊహిస్తేనే దిమ్మ తిరిగిపోతది. నడుస్తున్న బస్సులలో మానభంగాలు, వాహనాలకు మహిళలను కట్టి ఇడ్చుకు వెళ్లిన వైనం, సామూహిక అత్యాచారం జరిపి గుక్కెడు తాగునీళ్లు కావాలని కోరితే మూత్రాన్ని చేతిలో పోసి తా గించినటువంటి ఆగంతకుల ఆనవాళ్లు ఉన్న ఈ దేశం ఎటువైపు ప్రయాణిస్తున్నదో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది.ఇది కేవలం ప్రజలకు ప్రజాస్వామ్య వాదులకు మాత్రమే అవసరమా? పాలకుల బాధ్యత లేదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారానికి వస్తున్న పాలకులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? నేరస్తులను ఎందుకు శిక్షించడం లేదు? న్యాయవ్యవస్థ ఎందుకు స్తబ్దతకు గురవుతున్నది?దాని వెనుక ఉన్నటువంటి శక్తులు ఏమిటి? ఈ అంశాల పైన లోతైన చర్చ జరగాలి.
ప్రజాస్వామ్యం మేడిపండు కాకూడదు..
*****************************
"మేడిపండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండు" అన్న వేమన్న గారి మాటలు మేడిపండు చందంగా ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ, పాలన,రక్షణ లేని సామాన్య ప్రజానీకం యొక్క బాధలకు దర్పణంగా భావించవలసి ఉన్నది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాస్వామిక వ్యవస్థ ఇతర రాజకీయ వ్యవస్థల కంటే బలమైనదని నమ్మి స్వేచ్ఛ, సమానత్వము, సౌబ్రాతృతము వంటి అంశాలకు ఎక్కువ అవకాశం ఉంటుందని స్వీకరిస్తేనేమి ఆ అతి స్వేచ్ఛ పేదల, కష్టజీవుల, దిక్కు మొక్కు లేని అనాధల పాలిట మరణశాసన మైన మాట వాస్తవం కాదా? చట్టానికి మరింత పదును పెట్టి, న్యాయం తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించే విధంగా సామాన్య ప్రజల తలుపుతట్టి చైతన్యపరిచి, పేద వాడి కోపం పెదవికి చేటు కాదు కలవారి, ఆగంతకులు, నియంతలు, దేశద్రోహుల పదవికి చేటు అని చెప్పగలిగే చరిత్రను తిరిగి రాయగలిగే సత్తా దేశ ప్రజలకు ఉన్నది. తమ సత్తా ఏమిటో తమకు తెలియకుండా మౌనంగా ఉండేలా సామాన్య ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి వ్యవస్థ యొక్క కుట్రలను ఛే దించగలిగితే ప్రజల ఉగ్రరూపం మహోన్నతంగా వెలిగిపోతుంది. బాధ సర్పదస్టుల సమస్యలు పరిష్కారమవుతాయి. చీకటి దా రిలో చిక్కిపోతున్న వారికి వెలుగు రేఖలై దారి చూపుతాయి. , నైతిక విలువల పునాదిగా, మానవీయ ఆలోచనల వేదికగా ఆ ప్రయత్నం కొనసాగాలి. అందుకు ప్రజాస్వామిక వాదు లంతా కలిసి ఉద్యమించవలసిo దె.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )