నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
జోగులాంబ గద్వాల 25 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్ ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలను ప్రారంభించడానికి మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ శుబూదేంద్ర తీర్థ స్వామీజీ సాయంత్రం నాలుగు గంటలకు హాజరుకానున్నట్లు దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు స్వామివారికి ఆహ్వానం పలికినట్లు ఆయన తెలిపారు. మంగళవారం స్వామివారు సాంప్రదాయ రీతిలో కుమ్మరి వీధికి వెళ్లి వస్తారు. కాగా బ్రహ్మోత్సవాలకు కావలసిన ఏర్పాట్లపై దేవాలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.