**డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఘనంగా""నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల*

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : *నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 జయంతి ని మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల వారికి ఈనాడు సమాజంలో గౌరవం, గుర్తింపు లభించడానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యంగమే నన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సుచి అని తెలిపారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు పునరంకితమవుదామని వారు పేర్కొన్నారు* ఈ కార్యక్రమం మార్కెట్ డైరెక్టర్లు మీసా నాగేశ్వరావు సురేపల్లి రవి భూక్యా సీత మాజీ సర్పంచ్ వంగవీటి నాగేశ్వరావు నాయకులు కైలాసపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు