నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు
బీసీ కమిషన్ బృందంరాక జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ వెల్లడి
జోగులాంబ ప్రతినిధి గద్వాల:- తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం నవంబర్ 08న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు విచ్చేయనుందని కలెక్టర్ బి.యం .సంతోష్ తెలిపారు.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి ఉమ్మడి జిల్లాకు సంబంధించి నవంబర్,08 న మహబూబ్ నగర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని సభ్యులు
బీ.సీ వెల్ఫేర్ కమిషనర్లతో కూడిన బృందం ప్రజాభిప్రాయ సేకరణ జరుపనుందని వెల్లడించారు. తమ తమ అభిప్రాయాలు తెలియజేయాలనుకునే వారు రాతపూర్వక సమర్పణలు, అభ్యర్థనలను నేరుగా సమర్పించవచ్చని సూచించారు. వారి అభ్యర్థనలను నిర్దేశిత నమూనాలో తెలుగు లేదా ఆంగ్ల భాషలో ఇవ్వాల్సి ఉంటుందని, వారి వాదనలకు మద్దతుగా వారి వద్ద ఉన్న సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలను, సంబంధిత కేసుల వివరాలను పేర్కొంటూ, సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను కమిషన్ కు నివేదించవచ్చని కలెక్టర్ సూచించారు....