జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం దందా

బైకు పై రేషన్ బియ్యం తరలింపు

Oct 23, 2024 - 17:41
 0  45
జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం దందా
జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం దందా

జోగులాంబ గద్వాల 23 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందాను అడ్డుకట్ట వెయ్యాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ... అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? అధికారులు. నేటికీ జోగులాంబ గద్వాల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతుంది. అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని తరలించే విషయంలో కొత్త పంథాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో డీసీఎం, ఆటోలలో బియ్యాన్ని అక్రమంగా తరలించేవారు. కానీ కొందరు ఎవరికి అనుమానం రాకుండా ఉండే నేపముతో బైకులపై కోళ్ల దాన సంచులలో అది కూడా బైకుపై అక్రమ తరలిస్తున్నారు. ధరూరు మండల కేంద్రం గుండా ప్రతిరోజు ఒక వ్యక్తి బైక్ పై ఒక్కొక్కసారి మూడు సంచుల చొప్పున ప్రతిరోజు మూడుసార్లు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తీసుకెళ్తున్నాడు. ?ఈ బియ్యాన్ని ఎక్కడినుండి కొనుగోలు చేస్తున్నారో తెలియదు కానీ! ప్రతిరోజు సదరు వ్యక్తి మూడుసార్లు ఈ బియ్యాన్ని జాంపల్లి, కోతుల గిద్ద మద్య ఉన్న (రాయచూర్ రోడ్డు)మాజీ జెడ్పిటిసి అయినా పద్మ వెంకటేశ్వర్ రెడ్డి కోళ్ల ఫారం కు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపుగా నేటికీ కొన్ని నెలల తరబడి ఈ అక్రమ రేషన్ బియ్యం రవాణా కొనసాగుతూ వస్తుంది. ఏ అధికారి కూడా ఈ విషయంపై దృష్టి పెట్టడం లేదు. ఇప్పటికైనా స్పందించాలని జిల్లాలోని ప్రజలు కోరుతున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333