బుద్ధగయ రాజగృహను సందర్శించిన తెలంగాణ
రాష్ట్ర పర్యటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- బీహార్ లోని బుద్ధగయ రాజగృహలో బుద్ధుడు నివసించిన, విహరించిన స్థావరాలను ఏబి టీఓ ప్రధాన కార్యదర్శి కౌలేష్ కుమార్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి వివరించారు. బుద్ధుర్గయ లోని బుద్ధునికి సంబంధించిన ఆనవాళ్లు గ్రంధాలు చూపించిన అనంతరం పటేల్ రమేష్ రెడ్డి నలందాలోని ప్రాచీన బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని, హ్యుయాన్ త్సాంగ్ హాలును, నవ నలంద మహా విశ్వవిద్యాలయాన్ని, బౌద్ధ ప్రదర్శనశాలను, బౌద్ధ కట్టడాలు అవశేషాలను సందర్శించారు. బుద్ధగయ రాజ గృహ విశిష్టత లను, చారిత్రక వివరాలను పటేల్ రమేష్ రెడ్డికి స్తపతి శివ నాగిరెడ్డి వివరించారు. మహాబోధి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిని ఆలయ మర్యాదలతో ప్రోటోకాల్ దర్శనం చేయించిన అనంతరం బుద్ధగయ దేవాలయ విశేషాల పుస్తకాన్ని, బుద్ధుని ప్రతిమను బహుకరించారు.