ప్రభుత్వ నిర్లక్ష్యమా?అకాల వర్షమా?ఐకెపి సెంటర్లో మొలకెత్తుతున్న ధాన్యం
అడ్డగూడూరు 17 మే 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం పరిధిలోని వేల్దేవి గ్రామంలో శుక్రవారం రోజు రాత్రి కురిసిన అకాల వర్షానికి ఐకెపి సెంటర్లో తడిసి ముద్దైన ధాన్యం.. గ్రామంలోని రైతులు నెల రోజుల నుండి ఐకెపి సెంటర్లో ధాన్యాన్ని నిలవచేశారు. కానీ అధికారుల నిర్లక్ష్యమా..అకాల వర్షం కారణంగా లారీలు రాక ధాన్యం ఎగుమతులు ఆలస్యం అవ్వడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వమే ఎలాగైనా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుచున్నారు.రైతులు ఆరుగాలాలపాటు పండించిన పంటకు ఐకెపి సెంటర్లో పోసిన ధాన్యానికి ప్రభుత్వంమే మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుచున్నారు. ఐకెపి సెంటర్లో బస్తాలు కాంట అయిన రైతులకు తాడిపత్రి డేరాలు (పట్టాలు) ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఇంతవరకు ఈ ఐకిపి సెంటర్లకు ఇవ్వలేదని రైతులు గోడును ఆవేద పరుస్తున్నారు.ఐకెపి సెంటర్ లోని కోటమర్తి మల్లయ్య తండ్రి పిచ్చయ్య అనే ఒక రైతు బాధను వారి మాటల్లోనే విందాం.. ఇప్పటికైనా రైతులు బాధను అర్థం చేసుకొని అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని రైతులు కోరుతున్నారు.