ధూప దీప నైవేద్య సమాఖ్య అర్చకులకు 4 నెలల వేతనాలు ఇప్పించండి. జోగులాంబ గద్వాల జిల్లా DDNS అధ్యక్షులు చక్రవర్తి ఆచార్యులు

జోగులాంబ గద్వాల జూలై 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. జిల్లా ధూప దీప నైవేద్య జిల్లా అధ్యక్షులు చక్రవర్తి ఆచార్యులు , నిన్న జోగులాంబ గద్వాల జిల్లా సమక్య అర్చకుల నాలుగు నెలల జీతాలు బకాయిలో ఉండడం వలన ధూపదీప అర్చకులకు కుటుంబం గడవక చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి సమైక్య అర్చకుల తరఫున నిన్న రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ ని మర్యాదపూర్వకముగా కలిసి నాలుగు నెలల జీతాన్ని విడుదల చేసే విధంగా దేవాదాయ అధికారులతో మాట్లాడి తమవంతు ప్రయత్నం చేయాలని వినతి పత్రం అందజేసి వారిని జోగులాంబ గద్వాల జిల్లా తరఫున శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా సమైక్య అర్చకులు అందరూ పాల్గొన్నారు.