ఢిల్లీలో పెట్రోలియం  కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రులు

Jul 22, 2024 - 20:09
 0  11
ఢిల్లీలో పెట్రోలియం  కేంద్ర మంత్రిని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రులు

న్యూ ఢిల్లీ :జులై 22: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని కలిసిన రేవంత్ రెడ్డి 

తెలంగాణలో 500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని ఆయనకు తెలిపారు. వినియోగ దారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. 

అనంతరం జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావే శమై... మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కి సహకరిం చాలని కోరారు. హైదరా బాద్‌లోని మురికి నీరు అంతా మూసీలో చేరు తోందని... దానిని శుద్ధి చేయాలని సంకల్పించినట్లు కేంద్రమంత్రికి తెలిపారు. 

జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనుల కోసం 4 వేల కోట్లు కేటా యించాలని కోరారు. ఉస్మాన్ సాగర్, హిమా యత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపే పనుల కోసం 6 వేల కోట్లు కేటాయించా  లని విజ్ఞప్తి చేశారు. 

దీంతో హైదరాబాద్ ప్రజల కు నీటికష్టాలు తీరుతాయ న్నారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభ మైనా... తెలంగాణకు ఈ పథకం కింద నిధులు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333