**దేశంలో లౌకిక విలువలు కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ""సీతారాం ఏచూరి""సిపిఎం జిల్లా కమిటీ కోదాడ*

Aug 13, 2025 - 16:08
 0  21
**దేశంలో లౌకిక విలువలు కోసం పోరాడిన గొప్ప వ్యక్తి ""సీతారాం ఏచూరి""సిపిఎం జిల్లా కమిటీ కోదాడ*

*దేశంలో లౌకిక విలువల కోసం పోరాడిన గొప్పవ్యక్తి సీతారాం ఏచూరీ*   

 **సిపిఎం జిల్లా కమిటీ* *సభ్యులు* 

 *మిట్ట గనుపుల ముత్యాలు** 

     తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ.......  *కోదాడటౌన్* మార్క్సిస్టు మేధావి బహుముఖ ప్రజ్ఞశాలి సిపిఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ రాజ్యసభ సభ్యులు కామ్రేడ్ సీతారాం ఏచూరి దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తిని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మిట్టగనుపుల ముత్యాలు అన్నారు  

స్థానిక కోదాడ పట్టణంలో బుధవారం సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా కూరగాయల మార్కెట్లో సిపిఎం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు 

 ఈ సందర్భంగా ముత్యాలు మాట్లాడుతూ లౌకిక విలువల కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశ ఐక్యత కోసం నిరంతరం పరితపించిన గొప్ప నాయకుడు అని ఆయన కొనియాడారు విద్యార్థి ఉద్యమాల నుండి దేశ రాజకీయాల్లో మహోన్నతమైన నాయకుడిగా ఎదిగారని ఆయన అన్నారు దేశంలో మతోన్మాద రాజకీయాలు ఎండగట్టడంలో పార్లమెంటరీ పార్లమెంటరీ ఏతర పోరాటాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడని వారన్నారు ఈ లాంటి మహానుభావుని ఆశయ సాధన కోసం మనందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈయొక్క కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు తిరపయ్య బి శ్రీను సత్తిరెడ్డి డివైఎఫ్ఐ నాయకులు జంగపల్లి సాయి కుమార్ జంగపల్లి శ్రీను ఉపేందర్ వెంకన్న రాంబాబు సైదులు నాగరాజు తదితరులు పాల్గొని

 ఘనంగా నివాళులర్పించారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State