అనారోగ్యంతో మృతి చెందిన హోమ్ గార్డు  కుటుంబానికి తోటి సిబ్బంది  అండగా నిలవడం అభినందనీయం

- జిల్లా ఎస్పీ శ్రీ  తోట శ్రీనివాస రావు,IPS 

Jun 25, 2024 - 21:09
 0  14
అనారోగ్యంతో మృతి చెందిన హోమ్ గార్డు  కుటుంబానికి తోటి సిబ్బంది  అండగా నిలవడం అభినందనీయం

జోగులాంబ గద్వాల 25 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఈ సంవత్సరం  మార్చి నెలలో  అనారోగ్యం తో మృతి చెందిన హోమ్ గార్డు  యు.చంద్ర శేఖర్  కుటుంబానికి జోగుళాంబ గద్వాల్ జిల్లా కు చెందిన తోటి హోమ్ గార్డు అధికారులు  తమ వంతు సహాయంగా  55,000/-   ఆర్థిక సహాయం ను జిల్లా ఎస్పీ శ్రీ తోట శ్రీనివాస రావు,IPS   చేతులమీదుగా కుటుంబ సభ్యులకు  అందజేత.
గద్వాల్: సుమారు 12   సంవత్సరాలుగా తమ తో ఉంటూ వివిధ పోలీస్ స్టేషన్ లలో, పోలీసు సాయుధ దళ కార్యాలయం లో విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతూ విది వక్రీకరించడం వల్ల అనారోగ్యం తో మృతి చెందిన హోమ్ గార్డు యు.చంద్ర శేఖర్  కుటుంబానికి తమ తోటి బ్యాచ్  పోలీస్ హోమ్ గార్డు అధికారులు  అండగా నిలిచారు.
ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి  మృతి చెందడం తో వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్యేశం తో జిల్లా కు చెందిన తోటి హోమ్ గార్డు అధికారులు అందరూ కలిసి 55,000/- రూపాయలు జమ చేసి అట్టి నగదును  ఈ రోజు జిల్లా ఎస్పీ శ్రీ తోట శ్రీనివాస రావు,IPS   చేతుల మీదుగా భార్య జ్యోతికి  అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ   మృతి చెందిన హోం గార్డు కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,వారి కుటుంబానికి  తోటి బ్యాచ్ పోలీస్ సిబ్బంది  ఆర్ధికంగా అండగా నిలవడం అభినందనీయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ . ఐ వెంకటేష్, తోటి హోమ్ గార్డు సిబ్బంది రామ కృష్ణ,రాజశేఖర్,  కృష్ణ మరియు చంద్ర శేఖర్ కుటుంబ సభ్యులు   పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333