శిధిలావస్థలో ఉన్న తుమ్మల పెన్ పహాడ్ పాఠశాలకు తాళం

Aug 13, 2025 - 18:42
Aug 13, 2025 - 19:45
 0  15
శిధిలావస్థలో ఉన్న తుమ్మల పెన్ పహాడ్ పాఠశాలకు తాళం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ శిధిలావస్థలో ఉన్న తుమ్మల పెన్ పహాడ్ పాఠశాలకు తాళం. సెలవు ప్రకటించిన ఎంఈఓ దారాసింగ్.. ఆత్మకూర్ ఎస్.. మండల పరిధిలోని తుమ్మల  పెన్ పహాడ్ జడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాల తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నందున బుధవారం ఎంఈఓ దారాసింగ్ పాఠశాలకు తాళం వేసిసెలవు ప్రకటించారు . పాఠశాల గదులు స్లాబ్ పై నుండి పెచ్చులు రాలి పడుతుండడంతో వర్షాలకు ప్రమాదాలు సంబంవించే అవకాశం ఉందని డిఇఓ ఆదేశాల మేరకు పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. వర్షాల పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే డీఈఓ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని వారన్నారు.