పెన్ పహాడ్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా భూక్య శివ నాయక్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

Dec 4, 2024 - 18:31
Dec 4, 2024 - 20:36
 0  2
పెన్ పహాడ్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా భూక్య శివ నాయక్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

*యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా శివ నాయక్* *పెన్ పహాడ తెలంగాణ వార్త

యువజన కాంగ్రెస్ ఎన్నికలలో మండల అధ్యక్షుడిగా భూక్య శివ నాయక్ ఘన విజయం సాధించారు. బుధవారం వెల్లడించిన ఫలితాలలో 800 ఓట్లు సాధించి భారీ విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశానుసారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ రావు సహకారంతో పోటీ చేసిన నాకు ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పీసీసీ సభ్యులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్, వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, టీపీసీసీ కార్యదర్శి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తూముల భుజంగరావు ల ఆశీస్సులతో మండల వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ యువత వల్ల ఈ భారీ విజయం సాధ్యమైందని తెలిపారు. ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, యువజన కాంగ్రెస్ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలందరికీ చేరేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శివ నాయక్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు యువకులు, మిత్రులు అభినందనలు తెలిపారు.

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State