అనుమానాస్పదంగా తిరుగుతున్న దొంగ స్వాములు
మోత్కూర్ 29 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని గుర్తు తెలియని వ్యక్తులు పూజలు యంత్రాలు కడతామంటూ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కారులో మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని అనుమానస్పదంగా తిరుగుతున్నారు నిర్మానుష్యంగా ఉన్న ఇళ్లకు ఎక్కువగా తాళాలు వేసి ఉన్న బజారులో ఒంటరిగా ఉన్న మహిళల మరియు వృద్ధుల వద్దకు వచ్చి కారు దిగకుండానే దగ్గరకు రమ్మంటున్నారు ఏదో గుడి పేరు చెప్పి యంత్రాల కడతామని ఎవరైనా బాగు చేయించుకోవాలంటే మంచి చేస్తామని నమ్మబలుతున్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అలాగే పోలీస్ యంత్రాంగం ఈ దొంగ స్వాములపై ఒక కన్ను వేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు