ఉద్యమ నేల పైన బస్సు డిపో ఉద్యమం చేపడుతాం

ప్రత్యేక రాష్ట్ర సాధనే స్ఫూర్తితో తిరుమలగిరి కి బస్ డిపో సాధించుకుంటాం - డా.. ప్రవీణ్ కందుకూరి
-బస్ డిపో సాధన సమితి ఆధ్వర్యంలో సంకల్ప దీక్ష
బస్ డిపో నిర్మాణం చేపట్టకపోతే పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతాయి
తిరుమలగిరి మరియు పరిసర ప్రాంత గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా తిరుమలగిరిలో బస్ డిపో నిర్మాణం చేపట్టాల్సిందే
తెలంగాణ ఉద్యమంలాగా మరో బస్ డిపో నిర్మాణ ఉద్యమించే సమయం దగ్గరలోనే ఉంది - ప్రవీణ్ కందుకూరి
బస్ డిపో కల కలగానే మిగిలిపోతుంది యేండ్ల కొద్ది వేచి చూడాల్సి వస్తుంది ఇప్పటికైనా కల నెరవేరుతుంద అంటే నెరవేరడం లేకపాయే కానీ మా కలను నెరవేరే అంతవరకు పోరాడుతూనే ఉంటాం
కొందరు కుట్ర చేసి తిరుమలగిరి పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాలను అభివృద్ధి జరగకుండా అడ్డుకునేందుకు బస్ డిపో నిర్మాణం చేయకుండా చేస్తున్నారు
ఎన్నటికైనా బస్ డిపో నిర్మాణం జరిగేంతవరకు ఉద్యమిస్తూనే ఉంటాం
ఎన్ని అడ్డంకులు వచ్చిన బస్ డిపో నిర్మాణం చేపట్టే అంతవరకు పోరాటాలు చేస్తూనే ఉంటాం
నిర్మాణం అనే గమ్యాన్ని చేరుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు
తిరుమలగిరి 28 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
జాతీయ రహదారులు ఉన్న పట్టణాన్ని వదిలేసి వేరే గ్రామానికి బస్ డిపో ఇవ్వడం సరికాదు అంటే మా పట్టణాన్ని అభివృద్ధి జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బహుజన యుద్ధనౌక డా.. ఏపూరి సోమన్న విచ్చేసి బస్ డిపో సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప దీక్షకు పూర్తి సంఘీభావం తెలిపి డా.. ప్రవీణ్ కందుకూరికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు ఈ కార్యక్రమంలో కందుకూరి ప్రవీణ్, కందుకూరి సోమయ్య, కొత్తగట్టు మల్లయ్య, కడెం లింగయ్య, చిర్రబోయిన హనుమంతు, మేడబోయిన యాదగిరి, కందుకూరి రమేష్, గిలకత్తుల రమేష్, కొండ సోమయ్య, పాషా, గాఫ్ఫార్, వేల్పుల లింగయ్య, చిలకల రమేష్, దాసరి ప్రకాష్, సంఘపాక రవి, బుషిపాక ఉదయ్ , పోతరాజు మల్లేష్, పోతరాజు కృష్ణ, పి.డి.యస్.యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయిన కిరణ్, ఉపేందర్, రాజు, సాయి, ప్రశాంత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు