తుంగతుర్తి గిరిజన గురుకుల పాఠశాలలో పడకేసిన పారిశుధ్యం
గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో పడకేసిన పారిశుధ్యం
దుర్గంధం వెదజల్లుతున్న బాత్రూంలు
బెదిరింపులు గురి చేస్తున్న స్కూలు వార్డెన్
తుంగతుర్తి 09 నవంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలోని హాస్టల్ లో బాత్రూంలు, సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.. విద్యార్థినిలు సమస్యను పరిష్కరించాలని స్కూల్ వార్డెన్ దృష్టికి అనేక సార్లు తీసుకువెళ్లిన ఫలితం లేకపోగా బెదిరిస్తున్నారని విద్యార్థినిలు వాపోతున్నారు.. ఈ ఘటన లో స్థానిక గ్రామానికి చెందినా ఒక విద్యార్థినికి గత ఆదివారం నుండి విపరీతమైన జ్వరం వచ్చినా కూడా హాస్టల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలియజేయలేదు... ఆ విద్యార్థినికి చాలా సీరియస్ అయిందని విద్యార్థులు వాపోయారు. శుక్రవారం రోజు ఆ విద్యార్థిని ఆరోగ్యం విషమించడంతో ఖమ్మం లోనీ ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. ఈ మధ్య కాలం లోనే మాచనపల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని మృతి చెందిన విషయం విదితమే …ఇంత జరిగినా కూడా గురుకుల పాఠశాలలో మార్పు రాకపోవడం గమనార్హం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని... సరైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు కలెక్టర్ ను కోరుతున్నారు