సైబర్ మోసాలను నివారించడంలో విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి.
సైబర్ మోసాలను నివారించడంలో విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి.
తెలంగాణ వార్త 04.12.2024.సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రతి బుధవారం సైబర్ జాగృక్త కార్యక్రమం లో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన సూర్యాపేట జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ.
ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ సైబర్ మోసాలని నివారించడంలో యువత విద్యార్థులు ప్రథమంగా అవగాహన కలిగి ఉండాలని వీటి గురించి ఇంట్లో తల్లిదండ్రులకు పెద్దలకు చదువుకొని వారికి వివరించాలని తెలిపారు. డబ్బును లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా సోషల్ మీడియా లింక్స్ ద్వారా ప్రజలను సంప్రదించి బహుమతులు, ఉచితాలు ఆశ చూపి ఆర్థిక నష్టాలు కలిగిస్తున్నారు. ఎవరైనా ఫోన్ ద్వారా లేదా, ఎస్ఎంఎస్ ల ద్వారా ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ ఇలాంటి సోషల్ నెట్వర్క్ ల ద్వారా సంప్రదించి ఆఫర్స్ ఉన్నాయి అంటే దీని వెనుక సైబర్ మోసగాళ్ళు ఉన్నారు అని గుర్తు పెట్టుకోవాలి అన్నారు. ఇలాంటి వాటికి స్పందించి వ్యక్తి గత బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పవద్దు, నగదు బదిలీ చేయవద్దు అన్నారు. ఓఎల్ఎక్స్ నందు ఏవైనా వస్తువులు వాహనాలు తక్కువ ధరకు ఉన్నాయి అంటే నమ్మి నిర్ధారణ చేసుకోకుండా డబ్బులు చెల్లించవద్దు. కేవలం కస్టమర్ కేర్ ను సంప్రదించి డబ్బులు చెల్లించవద్దు. లోన్ యాప్ ల ద్వారా వ్యక్తిగత రుణాలు తీసుకోవద్దు. ఏటీఎం కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ వివరాలు అపరిచితులకు తెలపవద్దు. ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లు గుర్తిస్తే 19 30 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించి కేసు రిజిస్టర్ చేసుకోవాలి.
ఈ కార్యక్రమంలో ఎస్ వి కళాశాల యాజమాన్యం విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.