దళితుల ఆత్మగౌరవ నిరసన సభలో పాల్గొన్న అడ్డగూడూరు ఎం.ఆర్.పి ఎస్ నాయకులు
అడ్డగూడూరు 17 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్ పై దాడి చేసిన దుండగుడు రాఖేష్ కిషోర్ పై కేసు నమోదుచేసి అరెస్ట్ చేయకుండా అలసత్వం వహిస్తున్న డిల్లీ పోలీసులు తిరును నిరసిస్తూ సామాజిక ఉద్యమాల పితామహుడు ఎం.ఆర్.పి.ఎస్ వ్యవస్థపాక అధ్యక్షులు పద్మశ్రీ మంద క్రిష్ణ మాదిగ పిలుపు మేరకు చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా నేడు 17న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన దళితుల ఆత్మ గౌరవ నిరసన సభలో అడ్డగూడూరు ఎం.ఆర్.పి.ఎస్ మండల అధ్యక్షులు సూరారం రాజు మాదిగ మండల అధికార ప్రతినిధి పనుమటి సతీష్ మండల ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్ లు పాల్గొన్నారు.