ఆసుపత్రి లో చేరిన మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్

తెలంగాణ వార్త ఏప్రిల్ 10 నిజామాబాద్ జిల్లా ప్రతినిధి:- నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ రాజ్యసభ డి.శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు.కాగా ఆయన కుటుంబంలో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం చేర్పించారు.మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు డిఎస్ చిన్న కుమారుడు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు.ఆస్పత్రిలోని వైద్యులతో ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.విషయం తెలుసుకున్న డి.శ్రీనివాస్ అభిమానులు హైదరాబాదుకు బయలుదేరారు.