తల్లితండ్రులు& వయోవృద్ధులు మైంటెన్స్ అండ్ పోషణ సంక్షేమ చట్టం 2007 పై అవగాహన సదస్సు
జోగులాంబ గద్వాల 17 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఇటిక్యాల మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఇటిక్యాల మండలంలో లోని ఇటిక్యాల, ఎర్రవల్లి, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మరియు అంగన్వాడీ టీచర్స్ కు తల్లితండ్రులకు వయోవృద్ధుల చట్టాలపై అవగాహన కార్యక్రమం.
జోగులంగా గద్వాల్ జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ పిల్లల మీద ప్రేమ వల్ల కుటుంబ ప్రతిష్ట దిగజారుతుందన్న భయం వల్ల కేసు లావాదేవీలను నడిపేందుకు ఎంతో కాలాన్ని డబ్బును వెచ్చించవలసి రావడం వంటి కారణాలతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలపై ఈ రకమైన కేసులను వేయడం లేదు అందుకే పెద్దవారికి అవసరమైన పోషణ సంరక్షణ విషయాలలో సులభమైన వేగవంతమైన న్యాయ సహాయాన్ని అందించేందుకు న్యాయస్థానాలతో సంబంధం లేని ప్రత్యేక చట్టం తల్లిదండ్రుల వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007 తీసుకురావడం జరిగింది. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 14567 ఉంది దీనిని కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు.కాబట్టి గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరుకు ఈ యొక్క చట్టాన్ని ఈ యొక్క చట్ట నియమాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి కాబట్టి గ్రామంలో కార్యదర్శులు అంగన్వాడి టీచర్లు గ్రామంలో ఉండే వయోవృద్ధులు మరియు తల్లితండ్రులకు చట్టాలు చెరవేయాలని చెప్పడం జరిగింది. అలాగే బాల్య వివాహాలు గురించి అవగాహన కల్పించారు ఎవరైనా చిన్న వయస్సులో అనగా అమ్మాయికి 18సం, అబ్బాయికి 21సం, నిండక ముందే ఎవరైనా పెళ్లి చేసినట్లయితే లేదా చేయాలని చూసినా 1098 సమాచారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది అని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి, ఇటిక్యాల తహసీల్దార్ నరేష్, బద్రప్ప, ఎంపీడీఓ అజర్ మొహినిద్దీన్, ఎంపీఓ సునీల్, ఎంఇఓ అమీర్ పాషా, మెడికల్ ఆఫీసర్ శరణ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ జయమ్మ, పరమేశ్వరి, సిహెచ్ఎల్ సూపర్వైజర్ నవీన్, కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.