తోటి మిత్రులు ఆర్థిక సహాయం అందజేత1990-91 బ్యాచ్
అడ్డగూడూరు 25 మే 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన చింత వెంకటయ్య భార్య చింత కల్పన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఆ మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో తోటి మిత్రులు శనివారం రోజు 1990- 91 ఎస్ఎస్సి బ్యాచ్ సహకారంతో రూ, 15వేలు మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్కు బిక్షం రెడ్డి, కే .నరేందర్, టి. శ్రీనివాస్, దొడ్డి రమేష్, డి. సోమయ్య, కె. వెంకన్న తదితరులు పాల్గొన్నారు.