ముగిసిన సబ్ కమిటీ మీటింగ్

రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశం లో రైతు భరోసా విధి విధా నాలపై గంటన్నరపాటు సమావేశం కొనసాగింది. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా అమలు చేయాలనే విషయంపై కేబినెట్ సబ్ కమిటీ పూర్తిగా నిర్ణయించ లేదు. అయితే సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు సమాచారం.ప్రధానంగా టాక్స్ పేయర్స్, ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా అనర్హులుగా ప్రకటిం చాలని సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. అయితే మరోసారి రైతు భరోసాపై సమావేశం కావా లని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా అభి ప్రాయ సేకరణ జరిగింది, సాగు చేసే భూమికి మాత్ర మే రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. సచివాలయంలో జరిగిన సబ్ కమిటీ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,మంత్రి శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా,వ్యవసాయ అధికారులు సమావేశానికి హాజరయ్యారు.