తెలుగు రాష్ట్రాలలో నేడు రేపు దంచికొట్టనున్న వర్షాలు

హైదరాబాద్:జులై 06: తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. శని, ఆదివారాల్లో భారీ వర్షం కురవనున్నట్లు తెలిపింది. భారత వాతావరణ విభాగం
గుజరాత్ పై తుఫాన్ ప్రభావం ఉండగా, కేరళపై ధ్రోణి ప్రభావం ఉంది. వీటి కారణంగా ఏపీ, తెలంగాణ లో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఉంటాయి. ఎండ తక్కువగానే ఉంటుంది. ఇవాళ ఉత్తరాంధ్రలో కొన్ని చోట్లు వర్షం పడనుంది. మధ్యాహ్నం 2 తర్వాత ఆదోని, గుంతకల్, అనంతపురం, రాయదుర్గం, హైదరాబాద్లో వర్షం కురువ నున్నట్లు తెలిసింది..
ఈ వర్షం క్రమంగా పెరుగు తూ..తెలంగాణలోని చాలా చోట్లు, పశ్చిమ రాయల సీమలో చాలా చోట్లు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రం 5గంటల తర్వాత హైదరాబాద్, తెలంగాణ, రాయలసీమలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది.
హైదరాబాద్, కోస్తాంధ్ర, ఉత్త రాంధ్రలో రాత్రి 10గంటల తర్వాత మోస్తరుగా వర్షం కురుస్తుంది. రాత్రి 12గంటల తర్వాత ఉత్తరాంధ్రలో మోస్తరుగా పడుతుంది. అయితే ఇది అంచనా మాత్రమేనని..వాతావరణ శాఖ తెలిపింది.
అయితే ఇరు రాష్ట్రాలో గాలులు వీస్తాయి..వర్షం పడే సమయలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మొత్తానికి తెలంగాణ, ఏపీలో నేడు వర్షాలు కురుస్తాయని..ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు...