శ్రీలంక అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత అనురకుమార దిస్సానాయకే. ఇంతకీ ఎవరీ?అనుర కుమార దిస్సానాయకే?
హైదరాబాద్:సెప్టెంబర్ 23
మాజీ మార్క్సిస్ట్ రాజకీయ వేత్తను దేశ అధ్యక్షుడిగా శ్రీలంక ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ నేత అనుర కుమార దిసానాయక 42.31 శాతం ఓట్లతో విజయం సాధించారని కమిషన్ వెల్లడించింది.
ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస 32.76 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. రణిల్ విక్రమ సింఘే మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అయినా విక్రమ సింఘే ఇంకా పట్టు వీడలేదు. కానీ విదేశాంగ మంత్రి అలీ సాబ్రీ మాత్రం దిసానాయక గెలిచినట్లు స్పష్టమైందని అన్నారు.
అనూరా దిసనాయకె ఎవరు? 1968 నవంబరు 24న గలేవెల అనే చిన్న గ్రామంలో జన్మించిన దిసానాయక్ తన నాలుగేళ్ల వయసులో కేకిరావాకు వెళ్లారు. ఇక్కడే అతను పెరిగాడు. ఇప్పుడు మనం అతని విద్య గురించి మాట్లాడినట్లయితే!
అతను దంబూత్గామాలోని గామిని స్కూల్ నుండి తన చదు వును ప్రారంభించా డు.తరువాత అతను దంబూ త్గామ సెంట్రల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడ చదువులో నంబర్ వన్‌గా నిలిచాడు. అతను తన పాఠశాల నుండి విశ్వవి ద్యాలయంలో ప్రవేశం పొందిన మొదటి విద్యార్థి అయ్యాడు.