టీయుడబ్ల్యూజే తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టుల సమావేశం
నిర్వహించడం జరిగింది.విలేకరులే కానీ విలేకరులను ఉన్నతమైన పదవుల్లో నియమించిన ఘనత దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు గిరిధర్ కే దక్కుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే:-దేవరకొండ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ ఏర్పడిన అనంతరం విలేకరుల మధ్య చిచ్చుపెట్టి రెండు భాగాలుగా విడిపోయిన వారిలో టిడబ్ల్యూజే తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు ఒకటైతే,మరొకటి తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ అనుసంధానంగా ఏర్పడిందే 143 ఏర్పాటుచేసి అక్రిడేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే జర్నలిస్టులుగా గుర్తించి వారిని మాత్రమే గుర్తిస్తున్నామన్నట్టుగా గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియంత పోకడ కొనసాగించింది.తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆధీనంలో కొలువుదీరిన వేళ టీడబ్ల్యూజె ఐజేయు అనుసంధానంగా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది.ఏర్పాటులో ఎన్నో అనుమానాలు అవకతవకలు జరిగాయని యూనియన్ సంబంధించిన సభ్యత్వం తీసుకున్న జర్నలిస్టులు తీవ్రంగా విమర్శించడం జరిగింది.జర్నలిస్టులుగా అసలు గుర్తింపే లేని వారిని తీసుకువచ్చి ఉన్నతమైన పదవులను కట్టబెట్టడం జరిగిందని దానికి సహకరించిన నియోజకవర్గ అధ్యక్షుడు గిరిధర్ రావు ప్రముఖ పత్రికలో కొనసాగుతూ.తాను చెప్పిందే శాసనమన్నట్టు వ్యవహరిస్తూ తనకు నచ్చిన వ్యక్తులను మండల అధ్యక్షులుగా ఉప అధ్యక్షులుగా నియమించడం జరిగిందని,మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకోకుండా అసలు విలేకరులే కానీ విలేకరులను ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెట్టడం ఇది ఎంతవరకు సబమని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టులు తీవ్రంగా విమర్శించడం జరిగింది.