తెలంగాణ సాయి దురహితంగా పోరాటం అమరవీరులకు జోహార్లు.... బుర్రి శ్రీరాములు

Sep 13, 2025 - 06:42
 0  5
తెలంగాణ సాయి దురహితంగా పోరాటం అమరవీరులకు జోహార్లు.... బుర్రి శ్రీరాములు

మునగాల 12 సెప్టెంబర్ 2025

తెలంగాణ వార్తా ప్రతినిధి :- 

  భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల ఎట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు.

 శుక్రవారం సిపిఎం పార్టీ నేలమరి గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల ఎట్టి చాకలి విముక్తి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి నిజాం పోలీస్ రజాకార్లు, నెహ్రు సైన్యo కాల్పులకు 1949 డిసెంబర్ 30న అమరుడైన కామ్రేడ్ యంగలి పాపయ్య స్తూపం వద్ద ఎర్రజెండాను ఎగరేస్తూ వారికి ఘనంగా నివాళులర్పించారు 

 ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ మునగాల పరగణ ప్రాంతంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటం చారిత్రాత్మకమైనది వారు అన్నారు ఈ పోరాటం ఈ కరుడుగట్టిన భూస్వామ్య దోపిడీ దౌష్ట్యానికి నాటి హైదరాబాదు పాలకుడైన నిజాం రాజరిక పాలనకు మూడ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగింది ఈ పోరాటంలో నాలుగువేల మంది కమ్యూనిస్టు వీరకిషోరాలు బలైయ్యారని 3వేల గ్రామాలలో గ్రామ రాజ్యాలు నిర్మించారని 10 లక్షల ఎకరాల భూమిని వ్యవసాయ కూలీలకు భూమిలేని,పేద రైతులకు పంచి పెట్టారని ఈ పోరాట ఫలితంగా వెట్టిచాకిరి విధానం రద్దు అయిందని అన్నారు.

 ఇవ్వాలా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ని హిందూ ముస్లిం మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని హిందూ ముస్లిం ప్రజల మధ్య చిచ్చు పెట్టి మత రాజకీయం చేస్తున్నారని అన్నారు. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ్ ముఖ్ లకు, దొరలు బడా భూస్వాముల దోపిడి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిజాం నవాబ్ రజాకార్లకు, విసునూరు రామచంద్రారెడ్డి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అన్నారు.

 ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, ఈ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామ్ చరణ్, మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యులు బి మంగమ్మ, సిపిఎం మండల కమిటీ సభ్యులు బి ఉపేందర్ ఎం గోపయ్య పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి కె కోటయ్య, బి సుందరయ్య, బి రాములు, కె ఈదయ్య, రమణయ్య, వెంకటేశ్వర్లు,సికిందర్, షేక్ నబి, నాగమణి, రజిత, సత్యమని, లింగస్వామి, ఇంకా తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State