నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ కొల్లు వెంకటేశ్వర్లు

మునగాల 12 సెప్టెంబర్ 2025
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ. నివాసం లో. ఆయన ఆధ్వర్యంలో కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కొల్లూరి వెంకటేశ్వర్లు. . పని నిమిత్తం గ్రామానికి వచ్చిన సందర్భంగా తమ ఇంటికి ఆహ్వానించి.ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ వెంకటేశ్వర్లు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారని అలాగే ఇటీవల. తన ఆటోలో.ఎక్కిన ఒక వృద్ధ మహిళ. బ్యాంకు లో. తన వద్ద ఉన్న కొంత నగదు ను. డిపాజిట్ చేద్దామని. ఒక ప్రయివేటు బ్యాంకు వద్ద దిగి. తనతో తెచ్చిన బ్యాగ్ ను ఆటోలో మర్చిపోవడం జరిగింది. తదుపరి తన ఆటోలో ఇతర ప్రయాణికులను ఎక్కించుకునే క్రమంలో. వెనుతిరిగి చూసిన. ఆటో డ్రైవర్ సదరు వృద్ధ మహిళ దిగిన బ్యాంకు వద్ద కు వెళ్లి ఆమెను గుర్తించి ఆ బ్యాగ్ ను తిరిగి ఆమె కు ఇవ్వడం జరిగింది అని అందులో ఒక లక్ష రూపాయల నగదు రెండున్నర తులాల బంగారం ఆ మహిళ కు అప్పచెప్పి తన నీతి నిజాయితీ నిబద్ధత ను చాటుకున్నారు అని. నేడు. ప్రతి ఒక్కరూ స్వార్థంతో. ఇతరులను. మోసగించి . అక్రమంగా అన్యాయం గా ఆస్తులు సంపాదించుకుంటున్న నేపధ్యంలో. మానవతా విలువలకు తిలోదకాలు ఇస్తూ. సొంత వారిని. నమ్మిన వారిని నట్టేట ముంచే ప్రస్తుత సమాజంలో. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న. సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా. ఇతరుల సొమ్ము కు ఆశపడకుండా. తన కష్టంతో సంపాదించి న. సొమ్ము తో నే బతకాలన్న. వెంకటేశ్వర్లు. లాంటి వారి ని. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి అని. ఇలాంటి వారిని చూసైనా. మిగిలిన వారు మారాలని. ఇలాంటి వారిని గుర్తించి.వారికి. తగిన తోడ్పాటు అందించాలని. అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో. బారి లక్ష్మయ్య .చెర్వుపల్లి లింగయ్య. వీరబోయిన వీరస్వామి .వేముల రామయ్య . బొమ్మ యలమంచయ్య. . బుద్ది సాయి.. అల్లి వెంకటేష్. తోట గిరి. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు