జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల ప్రవర్తన పై అవగాహన సదస్సు

Sep 13, 2025 - 07:45
 0  2
జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల ప్రవర్తన పై అవగాహన సదస్సు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలలకు చట్టాలు – బాధ్యతలు, వారి ప్రవర్తన పై అవగాహన కార్యక్రమం ఆత్మకూరు ఎస్‌లోని జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాల రక్ష భవన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం “బాలలకు చట్టాలు – బాధ్యతలు, వారి ప్రవర్తన” అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రొటెక్షన్ అధికారి షేక్ మీరా మాట్లాడుతూ విద్యార్థి దశలో ఆలోచన విధానం మార్పు రావాలని, ప్రతి ఒక్కరూ లక్ష్యంతో చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చే విధంగా చదువుకుని సమాజానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని విద్యార్థులను కోరారు. పిల్లల అధికారి శ్రీలక్ష్మి మాట్లాడుతూ, పిల్లలకు స్నేహితుడిలా సహాయం చేసే చైల్డ్‌లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్ గురించి వివరించారు. బాల్యవివాహాలు, బాల కార్మికత్వం, బాలికలపై వేధింపులు మరియు ఇతర సమస్యలు ఉంటే వెంటనే 1098కు కాల్ చేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగ సిబ్బంది శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థి దశలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాదుల్లా ఉంటాయని, మంచి స్నేహాలు పెంచుకోవాలని, చెడు స్నేహాలను దూరంగా ఉంచాలని సూచించారు. ఉపాధ్యాయుల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల విధేయత చూపాలని, పాఠశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అలాగే పోక్సో చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జె. వెంకటేశ్వర్లు, అధ్యాపక బృందం, బాల రక్ష భవన్ అధికారులు షేక్ మీరా, శ్రీ లక్ష్మి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.