తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా
ఆమె చిత్రపటానికి నివాళులర్పించిన అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ పరితోష్ పంకజ్ ఐపిఎస్
ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా అడిషనల్ ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్ గారితో పాటు పోలీస్ అధికారులు మరియు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ తెలంగాణ వీరవనిత చిట్యాల ఐలమ్మ గారు సెప్టెంబరు 26,1895లో జన్మించి చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి అని తెలిపారు.వెనుకబడిన కులంలో జన్మించి కులవృత్తే జీవనాధారంగా జీవిస్తున్న చాకలి ఐలమ్మ గారికి దళారులతో ఎదురైన అవమానాలకు ఎదురొడ్డి వారిపై నిర్విరామ పోరాటం చేసి దొరల పాలనకు చరమగీతం పాడిన వీరమహిళ అని అన్నారు.ఆమె పోరాటంతో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని తెలిపారు.10.09.1985లో మరణించిన ఐలమ్మ గారు రాబోయే తరాలకు స్ఫూర్తి గా నిలిచారని తెలిపారు.ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమ సమాజ స్థాపన కోసం బాధ్యతగా తమ వంతు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి,సీఐ శ్రీనివాస్,సైబర్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ జితేందర్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్,కార్యాలయ ఏవో జయరాజు మరియు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.