**భూమి భుక్తి కోసం పోరాడిన మహిళ వీరనారి చాకలి ఐలమ్మ*
భూమి భుక్తి కోసం పోరాడిన మహిళ వీరనారి చాకలి ఐలమ్మ
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరావు
భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అన్నారు
స్థానిక కోదాడ పట్టణంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాంచన్ దొర నీ కాళ్లు మొక్కుతా అన్న బంధువుకులని మట్టి కరిపించి విసునూరు రామచంద్రారెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ఐలమ్మ.. నాటీ తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాడికి భూమి కావాలని పేదల భూములు ఆక్రమించుకున్న భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి భూములు పంచిపెట్టిన చరిత్ర ఆమెదని వారన్నారు. సాయుద పోరాటంలో అనేకమంది మహిళలకు కర్ర విద్యలు నేర్పి వర్టిశాలతో భూస్వామ్య పెత్తందారుల తలలు పగలగొట్టి పోరాటాన్ని ముందుకు నడిపి,, భూస్వామ్య పెత్తందారుల ఆగడాలను ఎండగట్టేందుకు ప్రజలను చైతన్యం చేస్తూ పేదలకు అండ ఎర్ర జెండా అని ప్రజా ఉద్యమాలు చేశారని, చిన్నతనం నుండి తను చనిపోయేంతవరకు ఎర్ర జెండా పోరాటాలతో జీవితాన్ని కొనసాగించారని వారన్నారు వారి ఆశయ సాధన కోసం యువత ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. ఎం ముత్యాలు. జుట్టు కొండ బసవయ్య. పార్టీ టౌన్ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్ షేక్ రెహమాన్ జి మరియన్న. సత్తిరెడ్డి ఉపేందర్ త్రిపయ్య వెంకన్న గురవయ్య శరభంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు