తుంగతుర్తి మండలంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
ఎమ్మెల్యే మందుల సామేలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న నల్లు రామచంద్ర రెడ్డి
తుంగతుర్తి:ఏప్రిల్ 22తెలంగాణ వార్త ప్రతినిధి:- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో సోమవారం బీ.ఆర్.ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ సమక్షంలో గానుగుబండ మాజీ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి, తో పాటు దాదాపు వందమంది బీ.ఆర్.ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామని మాజీ సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గంలో బీ.ఆర్.ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు పంజాల ప్రవీణ్, యనగంధుల అశోక్, బొల్లోజు భగవంతు, బొల్లోజు పిచ్చమ్మ, బింగి నవీన్, ఎనగందుల సోమయ్య, ఏనగందుల నవ్య పార్టీలో చేరారు