జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌.. 11 గంటల వరకూ 26 శాతం ఓటింగ్‌ నమోదు

Sep 18, 2024 - 19:33
 0  1
జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌.. 11 గంటల వరకూ 26 శాతం ఓటింగ్‌ నమోదు

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకూ 26.72 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.అనంత్‌నాగ్‌లో 25.55 శాతం, దోడాలో 32.30 శాతం, కిస్త్వార్‌లో 32.69 శాతం, కుల్గాంలో 25.95 శాతం, పుల్వామాలో 20.37 శాతం, రాంబ‌న్‌లో 31.25 శాతం, షోపియాన్లో 25.96 శాతం మేర పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.జమ్మూ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్‌ బుధవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ.. తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏడు జిల్లాల ప‌రిధిలోని 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. 23 ల‌క్షల మంది ఓట‌ర్లు తొలి విడుత‌లో ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌నుంది. బీజేపీ, నేష‌న‌ల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) ప్రధానంగా పోటీ ప‌డుతున్నాయి. ఎన్‌సీతో కాంగ్రెస్ పొత్తులో ఉంది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333