తాటిపాములలో ఉచిత నట్టల నివారణ ప్రారంభం
తిరుమలగిరి 24 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మండలo తాటిపాముల గ్రామలలోగొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బోయపెల్లి క్రిష్ణయ్య ప్రారంభించారు. , ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ శ్రీనివాస రావు, గొర్రెల కాపరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకొని గొర్రెలు మరియు మేకలలో నట్టల నివారణ జరిగితేనే ఆకలి గుణం పెరిగి, బాగా తింటాయని ఆరోగ్యంగా ఉండి అధిక బరువు పెరుగుతాయని, గొర్రె పిల్లల మరణాలు తగ్గుతాయని ,అధిక మాంస ఉత్పత్తి జరిగి ఆర్థికంగా లాభాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోనాసి ఎల్లమ్మ ఉప సoచాలకులు డాక్టర్. వెంకన్న, డాక్టర్ రవి ప్రసాద్, తిరుమలగిరి పాశు వైద్య అధికారి డాక్టర్ నవీన్ , డాక్టర్.నరేష్, తాటిపాముల ఎల్ ఎస్ ఎ. స్వప్న గ్రామ రైతులు పాల్గొన్నారు.