టెంకాయల కృష్ణ బారి నుండి మహిళలను రక్షించేది ఎవరు?. 

అసభ్య పదజాలంతో దళిత మహిళలను ధూషించి, క్యారెక్టరు మీద దాడి చేసి అవమానానికి గురి చేస్తే కేసు నమోదు చేయరా ?.

Feb 22, 2024 - 20:35
 0  4
 టెంకాయల కృష్ణ బారి నుండి మహిళలను రక్షించేది ఎవరు?. 

గతంలో సువర్ణ అనే దళిత మహిళపై దాడి.
నేడు సుజాత అనే దళిత మహిళ, రేపు మరి ఎవరొ ?.

ప్రభుత్వ వైద్యశాలలో స్వీపరు పనిచేసే పేద మహిళల అవసరాలను ఆసరా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ సకాలంలో వడ్డీ డబ్బులు చెల్లించలేని మహిళలను నీచాతి నీచంగా, మహిళల క్యారెక్టరు గురించి, లేబర్ మహిళలంటే ఇంతే అంటూ మరో అర్థంతో బాధిత దళిత మహిళను ధూషించిన టెంకాయల కృష్ణ మరియు టెంకాయల కృష్ణ భార్యపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు. నంది విజయలక్ష్మీ మాట్లాడుతూ 18.2.2024 వ తేదీన ఉదయం సుమారు 10.30 గంటల ప్రాంతంలో టెంకాయల కృష్ణ మరియు అతని భార్య కలిసి శ్రీరామ్ నగర్లో బాధిత దళిత మహిళ అక్క ఇంటికి వెళ్ళి నానా బూతులు తిట్టారు. బాధితురాలు స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే మూడవ పట్టణ పోలీసులు పట్టించుకోలేదు సరికదా, ఏం జరిగింది అని కనుక్కొనే ప్రయత్నం కూడా  చేయలేదు. మూడు రోజుల తర్వాత ఈరోజు బాధితురాలికి ఫోన్ చేసి స్టేషనుకు పిలిపించి, టెంకాయల కృష్ణ ఫిర్యాదు మేరకు నీవు వ్రాసిన ప్రాంసరి నోట్ టైం అయిపోతుందట, నీవు తిరిగి కొత్త ప్రాంసరి నోట్ టెంకాయల కృష్ణకు వ్రాసి ఇవ్వు అని పోలీసులు బాధితురాలిని ఒత్తిడి చేశారు. నన్ను ధూషించిన సంఘటనపై ముందు కేసు నమోదు చేయండి, ఆ తర్వాత నేను తిరిగి ప్రాంసరి నోట్ వ్రాసి ఇస్తాను అని బాధితురాలు చెబితే పోలీసులు అవేమి పట్టించుకోకుండా బాధితురాలినే అరుస్తూ తెల్లకాగితం మీద ఆమెతో బలవంతంగా సంతకం చేయించారు అని ఇది ఎక్కడి న్యాయం? అని నంది విజయలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళలను ధూషించినా, వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి నానా బూతులు తిట్టి అవమానించినా ఏ చర్యలు వుండవా అని ఆమె ప్రశ్నించారు. వడ్డీ వ్యాపారస్థుడు ప్రాంసరి నోట్ టైం అయిపోతుందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే మహిళలను స్టేషనుకు పిలిపించి బలవంతంగా సంతకం పెట్టించి న్యాయం చేస్తారా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఒక దళిత మహిళపై టెంకాయల కృష్ణ,అతని భార్య, కుమారుడు కలిసి దాడి చేసిన సంఘటనలో ఇదే స్టేషన్లో కేసు నమోదు అయితే రిమాండ్ కు వెళ్ళి, గత సంవత్సరంలో రాజీ చేసుకుని కేసు కొటేసుకున్న చరిత్ర టెంకాయల కృష్ణది అని ఆమె అన్నారు. పేద దళిత మహిళలను వడ్డీ వ్యాపారం పేరుతో జలగలా పీడిస్తూ, నానా బూతులతో ధూషించి, మహిళల క్యారెక్టరు గురించి నీచంగా మాట్లాడి అవమానించిన టెంకాయల కృష్ణ మరియు అతని భార్య పై చట్ట పరమైన చర్యలు చేపట్టాలని నంది విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపోరాటం ద్వారా టెంకాయల కృష్ణకు తగిన గుణపాఠం చెబుతామని ఆమె తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333