అభివృద్ధి పైనే దృష్టి పెట్టండి
: ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
అభివృద్ధి పైనే ఈ ఒక్క సంవత్సరం దృష్టి పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ రోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ లో జరిగిన వార్షిక బడ్జెట్ మరియు పురపాలక సంఘం యొక్క సాధారణ సమావేశాల కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ బడ్జెట్ ను ఉన్నతంగా రూపకల్పన చేసారని ఆయన చెప్పారు. గత నాలుగు సంవత్సరాలు అభివృద్ధి కి దూరంగా ఉన్న కాలనీలను, స్లామ్ ప్రాంతాలను గుర్తించి త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. సమన్వయంతో పార్టీలకు అతీతంగా వార్డులలో అవసరమైన మేర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి, పలు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కౌన్సిలర్లను ఆయన సూచించారు. ఇప్పటికీ కొన్ని కాలనీలు పూర్తిగా అభివృద్ధికి దూరం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పేదలు, దినసరి కూలీ పనులు చేసి బ్రతుకుతున్న పేదల కాలనీ లోని ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని , పేదల కాలనీ ల్లో సానిటేషన్ వ్యవస్థ ను మరియు ఆరోగ్య వ్యవస్థ పైన దృష్టి సారించాలని ఆయన సూచించారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన ప్రపోజల్ ను ఇప్పటికే పంపించడం జరిగిందని, వీలైనంత త్వరలో మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ లను తీసుకుని కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారిని కలిసి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తామని , అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని, మహబూబ్ నగర్ కు అమృత్ పథకం కింద రావాల్సిన నిధులు కూడా తెచ్చేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొన్ని కాలనీలు మాత్రమే అభివృద్ధి జరిగాయని, మీమీ కాలనీ ల్లో సిసి రోడ్డులు, డ్రైనేజీ లు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించి, కావాల్సిన అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేయాలని ఆయన సూచించారు.
చాలా సంవత్సరాల తర్వాత వార్డుల సమస్యలను అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి, మా దృష్టికి తీసుకొని రావడం సంతోషంగా ఉంది అని, దీనిని బట్టి అభివృద్ధి లో సమతుల్యం లోపించింది అని, ప్రజలకు అందుబాటులో ఉంటూ, మున్సిపాలిటీ కి వచ్చే ప్రతి పైసా సక్రమంగా ఖర్చు చేసేందుకు కౌన్సిల్ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. న్యూ మోతినగర్, అంబేద్కర్ కాలనీ ల్లో పేదవారు నివసిస్తున్న బస్తీలు, కాలనీలు, స్లమ్ ప్రాంతాల్లో అభివృద్ధి కి కలిసి సహకరించాలని ఆయన కోరారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని కాలనీల్లో ప్రజలకు ఏఏ అవసరాలు ఉన్నాయో గుర్తించి, ఈ ఒక్క సంవత్సరం చాలెంజ్ గా తీసుకుని, మున్సిపాలిటీ ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన సూచించారు. నూతన పాలక వర్గం అందరి సూచనలను, సలహాలను తీసుకొంటుందని, అందరూ కలిసి సమిష్టిగా కృషి చేసి, మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేసి కలిసి కట్టుగా మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపాలని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం 100కోట్లు ఇస్తున్నాం అని పేపర్లను ఇచ్చింది తప్ప, చిల్లీ గవ్వ కూడా మంజూరు చేయలేదు అని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయానని, ఆ విషయంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరిగింది అని నాడు ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నట్లు మోసం చేసింది అని ఆయన చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీకి రావాల్సిన టాక్స్ ను వసూలు చేయాలని, మన మున్సిపాలిటీ టాక్స్ ను ఆధారంగానే ప్రభుత్వ నిధులు మంజూరు అవుతాయి అని అందుకే పెండింగ్ లో ఉన్న టాక్స్ ను వసూలు చేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తు లో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తే బాగుంటుందో, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏలాంటి భేషజాలకు పోకుండా అభివృద్ధి కి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు తప్పకుండా అవసరం, కాబట్టి ఖచ్చితమైన ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిస్తే అభివృద్ధి కి సంబంధించి ఆర్థిక సహకారం అందుతుంది అని ఆయన చెప్పారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారి మౌఖిక ఆదేశాను సారం, ఈ సందర్భంగా 2024-25 సంవత్సరం లో కాంట్రాక్టర్ తైబజార్ వసూలు చేయరాదని మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిఫల్ చైర్మెన్ ఆనంద్ గౌడ్, మహబూబ్ నగర్ మున్సిఫల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మెన్ షబ్బీర్ అహ్మద్, బిఆర్ఎస్ కో.లీడర్ కట్టా రవికిరణ్ , బిజేపి కో. లీడర్ అంజయ్య యంఐయం కో.లీడర్ సాధుతుల్లా మరియు కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు అధికారులు అనధికారులు పాల్గోన్నారు.