అలంపూర్ ఆలయ ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం
జోగులాంబ గద్వాల 17 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్. లోని శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న నేపథ్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆలయ ఈవో దీప్తి జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు నిర్వహించు శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి మహాశివరాత్రి మహోత్సవాలకు కూడా రావాల్సిందిగా కలెక్టర్ ను ఆలయ ఈవో ఆహ్వానించారు.