అడ్డగూడూరులో ఐటిఐ కాలేజీకి భూమి పూజ చేసిన మంత్రి వివేక్,ఎంపి చామల,ఎమ్మెల్యేలు

Dec 31, 2025 - 20:50
Dec 31, 2025 - 20:52
 0  17

అడ్డగూడూరు 31 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఐటిఐ కాలేజీ భూమి పూజకి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి,భువనగిరి పార్లమెంట్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అవిలయ్య,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం,మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల కాలంలో లక్ష ఉద్యోగాలు నిరుద్యోగులకు అందించారని అన్నారు. వచ్చే ఏడాదిలో 40 వేల ఉద్యోగాలు వేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు.తుంగతుర్తి నియోజకవర్గంనికి 3వేల 6 వందల 22 కోట్లు ముఖ్యమంత్రి ద్వారా నియోజకవర్గానికి అందించారని అన్నారు.13వేల కోట్లు ఖర్చుపెట్టి పేదవారికి హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.1971,72లో ఇందిరాగాంధీ ప్రభుత్వం లో పేదవాళ్ళకి ఇంద్రమైను ఇవ్వడం జరిగిందని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగిందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడంలో ఎమ్మెల్యే మందుల సామేలు ముందు వరుసలో ఉన్నాడని అన్నారు.ది బెస్ట్ ఎమ్మెల్యే అని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొనియాడారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర,జిల్లా నాయకులు,నూతనంగా ఎన్నుకోబడిన నూతన సర్పంచులు,మహిళా సంఘాల నాయకురాలు,కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామశాఖల అధ్యక్షులు,పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333