అడ్డగూడూరులో సీఎం కప్పు టార్చి ర్యాలీ
అడ్డగూడూరు 17 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– సీఎం కప్ ఆటల పోటీల సందర్భంగా శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అడ్డగూడూరు నందు టార్చ్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య, ఎంఈఓ సబిత,ఎంపీఓ ప్రేమలత,సూపరిండెంట్, జడ్.పి.హెచ్.ఎస్ హెడ్మాస్టర్,కార్యాలయ సిబ్బంది.విద్యార్థులు మరియు క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈనెల 28 నుండి 31 వరకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించబడును. ఎంపీడీవో శంకరయ్య తెలిపారు.