గ్రామంలో ఎల్ఈడి లైట్స్ వేయించిన సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి
గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యం అని సర్పంచ్ కొత్త వెంకట్ రెడ్డి అన్నారు గ్రామంలో స్తంభాలకు వీధిలైట్లు వేయించారు.
ఈ సందర్భంగా కొత్త వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో వీధిలైట్లు సరింగ లేకపోవడం వల్ల రాత్రలపూట గ్రామ ప్రజలు వీధులలో నడవడానికి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని తెలుసుకుని, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పండగపూట మహిళలు, గ్రామస్తులు ఇబ్బందులు పడకూడదని ఎల్ఈడి లైట్లు వేయించారు. అలాగే గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ సింగోటం శోభ, వార్డ్ నెంబర్ మోసి మోని శివకుమార్, గ్రామస్తులు కుమ్మరి నరసింహ, సింగోటం బాలస్వామి, చిన్న మౌని నరేష్, రాఘవేంద్ర శెట్టి, కురువ మల్లయ్య, రోడ్డ బిచ్చన్న, షేర్ పల్లి వెంకటస్వామి, మామిళ్ళపల్లి వేణు సాగర్, దుబ్బన్న, గొందిపర్ల స్వామి, దయపు బీరయ్య, మార్కం మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.