పెండింగ్ లో ఉన్న నీటి సమస్యను తీర్చిన సర్పంచ్ వడ్డేమాన్ బిచ్చన్న
08-01-2026 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన కొప్పునూరు గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించిన... సర్పంచ్ వడ్డేమాన్ బిచ్చన్న. వడ్డేమాన్ బిచ్చన్న గారు మాట్లాడుతూ, నాకు ఇచ్చిన అవకాశాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని గ్రామంలోనే కాదు పొలిమేర పరిసర ప్రాంతాల్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తానని అన్ని దానాల్లోకెల్లా నీటి దానం గొప్పదని తెలుసుకొని పాతబడిన బోర్లను రిపేర్ చేయించాలని కాంక్షతో పాత కొప్పునూరు ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర మరియు 2వ వార్డులోని ఎల్లమ్మ గుడి దగ్గర రిపేర్ చేయించడం జరిగింది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో 2వ వార్డ్ మెంబర్ గంధం రేణుక, ఎలక్ట్రిషన్ కాశన్న యాదవ్. గ్రామ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.